పురాణం, వేద కాలం, నేటి కాలం... 5 వేల ఏళ్ల పురాతన ఆయుధం!
ABN , First Publish Date - 2022-01-17T03:01:51+05:30 IST
టాలీవుడ్ ‘మన్మథుడు’ నాగార్జున కొంత గ్యాప్ తరువాత బాలీవుడ్ బాటపట్టాడు. అయితే, ఈసారి ఆయన సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ ఫిల్మ్‌లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. రణబీర్, ఆలియా జంటగా రూపొందిన భారీ బడ్జెట్ బాలీవుడ్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ గురించి నాగ్ ఆసక్తికర వివరాలు వెల్లడించాడు.

‘బ్రహ్మాస్త్ర’ సినిమా... 5 వేల ఏళ్ల కిందటి మహాశక్తివంతమైన బ్రహ్మస్త్రం అనే ఆయుధం గురించిన కథ అంటున్నాడు నాగార్జున. తాను ఓ ఆర్కియాలజిస్టుగా నటిస్తున్నట్టు కూడా ‘కింగ్’ చెప్పాడు. అయితే, ‘‘ఆర్కియాలజీకి సంబంధించిన అంశాల కంటే... స్క్రిప్టు, పురాణ కథని వేద కాలం, నేటి కాలంతో అనుసంధానం చేయాలన్న తపన... నేను ఈ సినిమా చేసేలా చేశాయి...’’ అని వివరించాడు నాగ్. ‘బ్రహ్మాస్త్ర’లో ఆయనతో పాటూ అమితాబ్ బచ్చన్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. కాగా రియల్ లైఫ్ లవ్ బర్డ్స్ ఆలియా, రణబీర్ ఈ చిత్రంలోనే కలసి నటించారు. వారిద్దరి కాంబినేషన్ తెర మీద చూసేందుకు ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.