Ghost Action Trailer: డబ్బు, సక్సెస్‌తో పెరిగేది శత్రువులే!
ABN , First Publish Date - 2022-09-30T22:28:47+05:30 IST
అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ప్యాక్డ్ చిత్రం ‘ఘోస్ట్’ ట్రైలర్ విడుదలైంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అక్కినేని నాగార్జున (Nagrjuna) హీరోగా తెరకెక్కిన యాక్షన్ ప్యాక్డ్ చిత్రం ‘ఘోస్ట్’ (Ghost trailer)ట్రైలర్ విడుదలైంది. ప్రవీణ్ సత్తారు (Praveen sattaru) దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేశాయి. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో సాగిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. డబ్బు, సక్సెస్ సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది అని నాగార్జున చెప్పే డైలాగ్, ‘20 ఏళ్ల తర్వాత గుర్తొచ్చానా అని అడుగుతావా? అవసరానికి పిలిచావా అని అడుగుతావా? అని గుల్ పనాగ్ అడిగే సన్నివేశం భావోద్వేగంగా ఉంది. నాగార్జున నుంచి ఈ స్థాయి యాక్షన్ ఎప్పుడు చూడలేదనేలా ట్రైలర్ కట్ చేశారు. దర్శకుడు ప్రవీణ్‌కు కూడా ఇది కొత్త చిత్రంలాగే అనిపిస్తుంది. సోనల్ చౌహన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్, భరత్ సౌరబ్ సంగీతం అందించారు. సునీల్ నారంగ్ పూస్కూర్ రామ్మోహనరావ్, శరత్ మరార్ నిర్మాతలు. (THe Ghost on oct 5)