‘బంగార్రాజు’కు ఒక్కరోజులోనే ఇన్ని కోట్లు రావడం హ్యాపీ: నాగ్

‘బంగార్రాజు’కు ఒక్కరోజులోనే ఇన్ని కోట్లు రావడం హ్యాపీగా ఉందని అన్నారు కింగ్ నాగార్జున. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 2016లో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన 'బంగార్రాజు' సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14న విడుదలైంది. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతగా ప్రదర్శింపబడుతోంది. కరోనా సమయంలోనూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతోంది. ఈ నేపథ్యంలో నాగార్జున సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."జనవరి 14న అన్నపూర్ణ  పుట్టిన రోజు. నాన్నగారి ఏ సినిమా అయినా సంక్రాంతికి రిలేజ్ అయ్యేది. 'దసరా బుల్లోడు' సంక్రాంతి రోజే రిలీజ్ అయింది. అందుకే 'బంగార్రాజు' సినిమాను జనవరి 14న రిలేజ్ చేశాం.. ఒక్కరోజులోనే రూ. 17.5 కోట్లు కలెక్షన్స్ రావడం హ్యాపీగా అనిపించింది" అన్నారు. ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగర్జున నిర్మించారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.