థియేటర్స్‌లోనే నాగచైతన్య చిత్రం

ABN , First Publish Date - 2021-12-08T18:10:21+05:30 IST

ఇటీవల శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరీ’ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నారు అక్కినేని నాగచైతన్య. ప్రస్తుతం విక్రమ్ కుమార్ థాంక్యూ, కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ‘థాంక్యూ’ చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. చైతూ మహేశ్ బాబు ఫ్యాన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇంటెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. అయితే ఇలాంటి సినిమాను థియేటర్స్ లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు నిర్ణయించుకున్నారట. ఇంతకు ముందు దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందిన నానీ, సుధీర్ బాబు ‘వి’ చిత్రం అమెజాన్ ప్రైమ్ విడుదలయిన సంగతి తెలిసిందే.

థియేటర్స్‌లోనే నాగచైతన్య చిత్రం

ఇటీవల శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరీ’ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నారు అక్కినేని నాగచైతన్య. ప్రస్తుతం విక్రమ్ కుమార్ థాంక్యూ, కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ‘థాంక్యూ’ చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. చైతూ మహేశ్ బాబు ఫ్యాన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇంటెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. అయితే ఇలాంటి సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందిన నానీ, సుధీర్ బాబు ‘వి’ చిత్రం అమెజాన్ ప్రైమ్ విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు రూ. 33కోట్లకు విక్రయించారు. సినిమా రిజల్ట్ తేడా కొట్టినా.. దిల్ రాజు మాత్రం ఆ సినిమాతో టేబుల్ ప్రాఫిట్ అందుకున్నారు. 


అందుకే నాగచైతన్య ‘థాంక్యూ’ చిత్రాన్ని కూడా దిల్ రాజు అమెజాన్ ప్రైమ్ కే ఇవ్వబోతున్నారని వార్తలొచ్చాయి. అంతేకాదు.. ఈ సినిమాకోసం ఆయన కళ్ళు చెదిరే ఆఫర్ అందుకున్నారట. దాంతో ఈ సినిమాను ఓటీటీలోనే విడుదల చేయబోతున్నట్టు రూమర్స్ స్ర్పెడ్ అయ్యాయి. దాంతో మేకర్స్ .. ఈ సినిమా విడుదల పై క్లారిటీ ఇచ్చారు. ‘థాంక్యూ’ చిత్రాన్ని థియేటర్స్ లోనే విడుదల చేస్తామని అఫీషియల్ గా ప్రకటించారు.  రాశీఖన్నా అవికాగోర్ కథానాయికలుగా నటిస్తున్న ‘థాంక్యూ’ మూవీ పై భారీ అంచనాలున్నాయి. మరి ఈ సినిమాతో చైతూ ఏ రేంజ్ హిట్ అందుకుంటారో చూడాలి. 

Updated Date - 2021-12-08T18:10:21+05:30 IST