Naga Chaitanya : తమ్ముడి దర్శకుడితో సినిమా?

Twitter IconWatsapp IconFacebook Icon
Naga Chaitanya : తమ్ముడి దర్శకుడితో సినిమా?

‘లవ్‌స్టోరీ, బంగార్రాజు’ చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకున్న అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya).. ప్రస్తుతం ‘థాంక్యూ’ (Thank You) అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కె కుమార్ (Vikram k kumar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. దీని తర్వాత తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu), పరశురామ్ (Parasuram).. ఆపై నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలోనూ నటించబోతున్నాడు చైతూ. ఇక వీటితో పాటు నాగచైతన్య దర్శకుల లిస్ట్ లోకి మరో టాలెంటెడ్ డైరెక్టర్ కూడా చేరబోతున్నాడు. అతడు మరెవరో కాదు బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar). ‘బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త’ లాంటి సినిమాలతో మంచి దర్శకుడు అనిపించుకున్న భాస్కర్..  రీసెంట్‌గా అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం‌తో తిరిగి దర్శకుడిగా మంచి ఫామ్‌లోకి వచ్చాడు. తమ్ముడి కెరీర్‌లో తొలి హిట్టిచ్చిన ఈ దర్శకుడితో తాను వర్క్ చేయాలనుకుంటున్నాడట చైతూ (Chaithu). 


ఇటీవల నాగచైతన్య ((Naga Chaitanya) కు ఓ యూత్ ఫుల్ స్టోరీ వినిపించాడట దర్శకుడు భాస్కర్ (Bhaskar). ఆ కథకు బాగా ఇంప్రెస్ అయిన చైతూ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి. ఇప్పటికే కథను లాక్ చేశాడట భాస్కర్. పరశురామ్ (Parasuram) చిత్రం తర్వాత చైతూ నటించబోయేది ఈ సినిమాలోనేనని టాక్. వైవిధ్యమైన ప్రేమకథా చిత్రాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న బొమ్మరిల్లు భాస్కర్ నాగచైతన్యకి ఏ తరహా కథ రాసుకున్నాడు అనే విషయంలో ఆసక్తి నెలకొంది. మరి తమ్ముడికి మెమరబుల్ హిట్టిచ్చిన భాస్కర్ .. అన్నకు ఏ రేంజ్ సక్సెస్ ఇస్తాడో చూడాలి.  

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.