అక్కినేని నాగచైతన్య తొలిసారి నటిస్తున్న హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. ఆమీర్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లద్దాఖ్‌లో జరుగుతోంది. చైతూ గురువారం ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టారని సమాచారం. ఆమిర్‌ఖాన్ సైన్యంలో పనిచేసే సమయంలో ఆయన మిత్రుడి పాత్రలో నాగచైతన్య కనిపించనున్నారు. 20 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో ఆమిర్, నాగచైతన్యపై యుద్ధ ఘట్టాలను చిత్రీకరించనున్నారు. హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కు ఇది అధికారిక రీమేక్. కరీనాకపూర్ కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ‘లవ్‌స్టోరీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థాంక్యూ’ చిత్రీకరణ దశలో ఉంది.