నాగశౌర్య ‘వరుడు కావలెను’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

ABN , First Publish Date - 2021-10-15T22:40:13+05:30 IST

తార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘. ఈ సినిమాని అక్టోబర్ 29 న విడుదల చేయనున్నట్లు నేడు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

నాగశౌర్య ‘వరుడు కావలెను’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘. ఈ సినిమాని అక్టోబర్ 29 న విడుదల చేయనున్నట్లు నేడు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఇప్పటికే విడుదల అయిన '‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా', అలాగే 'దిగు దిగు నాగ', ‘‘మనసులోనేనిలిచి పోకె మైమరపుల మధురిమ పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు విడుదల చేసిన చిత్రాలు, ప్రచార చిత్రాలకి కూడా ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. వీటికి సోషల్ మీడియాలో కూడా మంచి స్పందన లభించింది. 


ప్రేమ, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో ‘వరుడు కావలెను‘ చిత్రం  ప్రేక్షకుల్ని అలరించటానికి  వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 29 న విడుదల అవుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు గా నటిస్తుండగా.. నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.



Updated Date - 2021-10-15T22:40:13+05:30 IST