‘లక్ష్య’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

ABN , First Publish Date - 2021-09-28T00:05:41+05:30 IST

నాగశౌర్య హీరోగా నటిస్తున్న 20వ చిత్రం ‘లక్ష్య’. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్‌ 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించారు.

‘లక్ష్య’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

నాగశౌర్య హీరోగా నటిస్తున్న 20వ చిత్రం ‘లక్ష్య’. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్‌ 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో కొత్త లుక్‌లో కనిపించారు నాగశౌర్య. విలువిద్య పాత్రకు తగ్గ బాడీతో ఆకట్టుకుంటున్నారు. ఈ స్పోర్ట్స్‌ డ్రామాలో నాగ శౌర్య రెండు విభిన్నమైన గెటప్పుల్లో కనిపించబోతోన్నారు. నారాయణ్‌ కె నారంగ్‌, పుస్కూరు రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


Updated Date - 2021-09-28T00:05:41+05:30 IST