నా తమ్ముడికి మీ సపోర్ట్‌ కావాలి నాగశౌర్య

ABN , First Publish Date - 2021-07-24T05:43:07+05:30 IST

‘నా తమ్ముడు బ్రహ్మాజీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాడు. మీ అందరి సపోర్ట్‌ తనకు కావాలి. దయచేసి కొత్త ప్రతిభావంతుల్ని ప్రోత్సహించండి’ అని తను, బ్రహ్మజీ కలసి ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ సరదాగా ట్వీట్‌ చేశారు హీరో నాగశౌర్య...

నా తమ్ముడికి మీ సపోర్ట్‌ కావాలి నాగశౌర్య

‘నా తమ్ముడు బ్రహ్మాజీ ఇండస్ట్రీకి కొత్తగా  వచ్చాడు. మీ అందరి సపోర్ట్‌ తనకు కావాలి. దయచేసి కొత్త ప్రతిభావంతుల్ని ప్రోత్సహించండి’ అని తను, బ్రహ్మజీ కలసి ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ సరదాగా ట్వీట్‌ చేశారు హీరో నాగశౌర్య. ఆయన హీరోగా అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ నిర్మిస్తున్న షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిత్రంలోని కీలక సన్నివేశాలను, హాస్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తను ఇంతవరకూ చేయని ఓ ప్రత్యేకమైన హీరో పాత్రను నాగశౌర్య పోషిస్తున్నారు. ఆయనకు జోడీగా షీర్లే సేతియా నటిస్తున్నారు. బ్రహ్మజీ మరో ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో నాటి హీరోయిన్‌ రాధిక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బుజ్జి, నిర్మాత: ఉషా ముల్పూరి, సమర్పణ: శంకర్‌ప్రసాద్‌ ముల్పూరి.

Updated Date - 2021-07-24T05:43:07+05:30 IST