కృష్ణ... వ్రిందల ప్రేమకథ

ABN , First Publish Date - 2022-01-23T08:05:00+05:30 IST

నాగశౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది..

కృష్ణ... వ్రిందల ప్రేమకథ

నాగశౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫిర్లే సెటియా కథానాయిక. అనిష్‌ ఆర్‌.కృష్ణ దర్శకుడు. ఉషా మల్పూరి నిర్మాత. ఈ చిత్రానికి ‘కృష్ణ వ్రింద విహారి’ అనే పేరు ఖరారు చేశారు. శనివారం నాగశౌర్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా టైటిల్‌ లోగోతో పాటుగా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఓ డిఫరెంట్‌ ప్రేమకథ ఇది. కృష్ణ, వ్రిందల మధ్య సాగిన ప్రేమని వినోదాత్మకంగా చూపించబోతున్నాం. నాగశౌర్య ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లోకంటే.. ఈ పాత్ర కొత్త తరహాలో సాగుతుంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తామ’’న్నారు. రాధిక, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు నటించారు. సంగీతం: మహతి స్వర సాగర్‌. 

Updated Date - 2022-01-23T08:05:00+05:30 IST