Naga chaithanya: కొత్త ప్రయాణం మొదలు..

ABN , First Publish Date - 2022-03-02T13:20:51+05:30 IST

అక్కినేని హీరో నాగచైతన్య కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ మధ్య కామలో మన టాలీవుడ్ స్టార్స్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చి ప్రయోగాలను చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Naga chaithanya: కొత్త ప్రయాణం మొదలు..

అక్కినేని హీరో నాగచైతన్య కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ స్టార్స్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చి ప్రయోగాలను చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్‌లో విభిన్నమైన పాత్రలు పోషించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ - రానా దగ్గుబాటి కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. అలాగే, స్టార్ హీరోయిన్స్ సమంత, తమన్నా, నిత్యా మీనన్, కాజల్ లాంటి వారు ఈ వెబ్ సిరీస్ మీద చాలా ఆసక్తి చూపిస్తున్నారు.


ఈ క్రమంలోనే అక్కినేని నాగ చైతన్య కూడా డిజిటల్ ఎంట్రీ ఇస్తూ ఆ మధ్య వెబ్ సిరీస్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి చైతు కూడా అవుననే సమాధానమిచ్చాడు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలైంది. మహాశివరాత్రి పండుగ సందర్భంగా మంగళవారం నాడు సోషల్ మీడియా వేదికగా నాగచైతన్య తన డిజిటల్ ఎంట్రీకి సంబంధించిన విషయాన్ని వెల్లడించాడు. ఈ మేరకు ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను కూడా తన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోని పంచుకున్న చైతు.. దానికి 'దూత స్టార్ట్స్' అంటూ షేర్ చేశాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు 'దూత' అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేశారు. మొత్తం మూడు సీజన్లుగా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించబోతున్నారని, ఒక్కో సీజన్లో 8 నుంచి 10 ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. 

Updated Date - 2022-03-02T13:20:51+05:30 IST