Thank You Teaser: తనని సరి చేసుకోవడానికి చైతూ చేస్తున్న ప్రయాణం

ABN , First Publish Date - 2022-05-25T23:16:39+05:30 IST

యువసామ్రాట్ (YuvaSamrat) నాగచైతన్య (Naga Chaitanya), దర్శకుడు విక్రమ్ కె. కుమార్ (Vikram K Kumar) కాంబినేషన్‪లో రూపొందుతోన్న చిత్రం ‘థ్యాంక్యూ’ (ThankYou). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‪లో

Thank You Teaser: తనని సరి చేసుకోవడానికి చైతూ చేస్తున్న ప్రయాణం

యువసామ్రాట్ (YuvaSamrat) నాగచైతన్య (Naga Chaitanya), దర్శకుడు విక్రమ్ కె. కుమార్ (Vikram K Kumar) కాంబినేషన్‪లో రూపొందుతోన్న చిత్రం ‘థ్యాంక్యూ’ (ThankYou). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‪లో దిల్ రాజు (Dil Raju)- శిరీష్ (Sirish) నిర్మిస్తున్నారు. నాగచైతన్య సరసన రాశీ ఖన్నా (Raashi Khanna), మాళవిక నాయర్ (Malavika Nair) హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూలై 8న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లుగా ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‪ని మేకర్స్ విడుదల చేశారు. చైతూ మార్క్ నటనతో ఈ టీజర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. 


టీజర్ విషయానికి వస్తే ...బిజినెస్ టైకూన్ అభిరామ్(Abhiram) పాత్రలో నాగచైతన్య కనిపిస్తున్నారు. ఓ సాధారణ కుర్రాడి నుంచి ఈ స్థాయికి ఆయన ఎదిగినట్లు చూపించారు. ఈ ప్రయాణంలో అతనికి ముగ్గురు అమ్మాయిలతో పరిచయం ఏర్పడింది. గెలుపు పరుగులో తనతో తానే, తనకు తానే అయ్యాడు. ‘నువు సెల్ఫ్ సెంట్రిక్ అయ్యావు, నీ లైఫ్ లో నీకు తప్ప మరో వ్యక్తికి చోటు లేదు’ అని నాయిక మాటలు నేపథ్యంగా వినిపిస్తున్నాయి. ఆ మాటలే అభిరామ్‪లో మార్పు తీసుకొచ్చాయి. ‘‘అన్నీ వదులుకుని ఇక్కడిదాకా వచ్చాను, ఇక లైఫ్‪లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు, నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే ..’’ అంటూ నాగచైతన్య చెప్పిన డైలాగ్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఓ సక్సెస్ ఫుల్ పర్సన్ జీవితంలోని ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.


ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్స్‪తో ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెరిగాయి. ఇక టీజర్ తర్వాత మరింతగా ఈ సినిమాపై క్రేజ్ పెరగడం ఖాయం అనేలా టీజర్ ఉంది. కాగా, లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ (PC Sreeram) ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి.. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ (Thaman) స్వరాలు సమకూరుస్తున్నారు. బీవీఎస్ రవి (BVS Ravi) కథను అందించగా.. నవీన్‌ నూలి (Naveen Nooli) ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేమ్ అవికాగోర్ (Avika Gor) ఓ కీలక పాత్రలో కనిపించనుంది.



Updated Date - 2022-05-25T23:16:39+05:30 IST