మళ్ళీ సెట్స్‌పైకి నాగచైతన్య ‘థాంక్యూ’

ABN , First Publish Date - 2022-01-25T14:11:05+05:30 IST

నవ సామ్రాట్ నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న థ్రిల్లర్ మూవీ ‘థాంక్యూ’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. అయితే చైతూ ముందుగా ‘బంగార్రాజు’ చిత్రాన్ని పూర్తి చేయాల్సి రావడంతో ‘థాంక్యూ’ చిత్రీకరణను తాత్కాలికంగా పక్కనపెట్టారు. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన ‘బంగార్రాజు’ చిత్రం ఘన విజయం సాధించడంతో.. మరింత ఉత్సాహంతో ఇప్పుడు ‘థాంక్యూ’ చిత్రం షూటింగ్ ను తిరిగి ప్రారంభించాడు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని దిల్ రాజు భావిస్తున్నారట.

ఏప్రిల్ నాటికి ‘థాంక్యూ’ టాకీ పార్ట్‌ను కంప్లీట్ చేసి.. ఆ తర్వాత ప్రమోషన్స్ మొదలు పెట్టాలని భావిస్తున్నారట. ఉగాదికి ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసి సమ్మర్ లో చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. తమన్ సంగీతం అందిస్తుండగా.. రాశీఖన్నా కథానాయికగా నటిస్తోంది. మాళవికా నాయర్, అవికా గోర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో క్రికెటర్ గానూ, మహేశ్ బాబు అభిమానిగానూ చైతూ నటిస్తున్నారు. మరి ఈ సినిమా అతడికి ఏ స్థాయి సక్సెస్ ఇస్తుందో చూడాలి. 

Updated Date - 2022-01-25T14:11:05+05:30 IST