చైతూ వదిలిన ‘లక్ష్య’ మూవీ ‘సయా సయా’ సాంగ్‌

ABN , First Publish Date - 2021-12-05T02:21:47+05:30 IST

యంగ్ హీరో నాగ శౌర్య, కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా.. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్య’. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్..

చైతూ వదిలిన ‘లక్ష్య’ మూవీ ‘సయా సయా’ సాంగ్‌

యంగ్ హీరో నాగ శౌర్య, కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా.. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్య’. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. ఈ చిత్రం డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్రంలోని ‘సయా సయా’ సాంగ్‌ని యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య విడుదల చేశారు. ఈ సాంగ్ విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, ‘లక్ష్య’ ట్రైలర్ చాలా బాగుందని సినిమా మంచి విజయం సాధించాలని చైతూ కోరారు.


ఈ పాటకు కృష్ణ కాంత్ సాహిత్యాన్ని అందించగా.. కాళ భైరవ క్యాచీ మెలోడి ట్యూన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక జునైద్ కుమార్ గాత్రం శ్రావ్యంగా ఉంది. నాగశౌర్య, కేతిక శర్మలపై ఈ సాంగ్ తెరకెక్కింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



Updated Date - 2021-12-05T02:21:47+05:30 IST