బాలీవుడ్‌ సినిమా సెట్స్‌లో చైతూ.. పిక్ వైరల్‌

యువసామ్రాట్‌ నాగచైతన్య ఓ బాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘లాల్ సింగ్ చద్దా’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్ర షూటింగ్‌లోకి జాయిన్‌ అయినట్లుగా తాజాగా చైతూ ఓ పిక్‌ని షేర్‌ చేశారు. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చైతూతో పాటు ఈ పిక్‌లో మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌, కిరణ్‌ రావు, దర్శకుడు అద్వైత్ చందన్ ఉన్నారు. అలాగే ఈ చిత్రంలో తన పాత్ర పేరు 'బాల' అనేది కూడా చైతూ సోషల్‌ మీడియాలో రివీల్‌ చేశాడు. ఆమిర్‌ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం లడఖ్‌లో చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.