నాకు నెక్ట్స్‌ లెవల్‌ సినిమా: నాగ చైతన్య

ABN , First Publish Date - 2021-09-23T22:37:17+05:30 IST

‘‘గాసిప్స్‌ కోసం నా పేరు వాడడం చాలా బాధనిపించింది. ప్రతి ఒక్కరికీ, వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలుంటాయి. రెండింటినీ కలిపి చూడకూడదు. కెరీర్‌‘‘గాసిప్స్‌ కోసం నా పేరు వాడడం చాలా బాధనిపించింది. ప్రతి ఒక్కరికీ, వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలుంటాయి. రెండింటినీ కలిపి చూడకూడదు. కెరీర్‌z బిగినింగ్‌ నుంచీ పర్సనల్‌ లైఫ్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను వేరుగా చూడడం నేర్చుకున్నా. మా తల్లిదండ్రులు కూడా ఇదే పద్దతిని ఫాలో అవుతారు. నాది అదే దారి’’ అని నాగచైతన్య అన్నారు.

నాకు నెక్ట్స్‌ లెవల్‌ సినిమా: నాగ చైతన్య


‘‘గాసిప్స్‌ కోసం నా పేరు వాడడం చాలా బాధనిపించింది. ప్రతి ఒక్కరికీ, వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలుంటాయి. రెండింటినీ కలిపి చూడకూడదు. కెరీర్‌ బిగినింగ్‌ నుంచీ పర్సనల్‌ లైఫ్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను వేరుగా చూడడం నేర్చుకున్నా. మా తల్లిదండ్రులు కూడా ఇదే పద్దతిని ఫాలో అవుతారు. నాది అదే దారి’’ అని నాగచైతన్య అన్నారు. తనకు నచ్చిన కథలతోనే సినిమాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారాయన. తాజగా ‘లవ్‌స్టోరి’ చిత్రంతో అలరించనున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయిక. నారాయణ దాస్‌ నారంగ్‌, పి.రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 24న విడుదల సందర్భంగా నాగచైతన్య విలేకర్లతో ముచ్చటించారు. 



– దర్శకుడు శేఖర్‌ కమ్ములగారి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయనతో పనిచేయాలని చాలాకాలంగా అనుకుంటున్నా. ఆయన కథల్లో రియలిస్టిక్‌ అప్రోచ్‌ ఉంటుంది. ఆ తరహా కథలంటే నాకు అమితాసక్తి. ‘మజిలీ’తో నాకు అలాంటి సంతృప్తి కొంత దొరికింది. క్యూట్‌ లవ్‌స్టోరితో తెరకెక్కిన ఈ చిత్రంతో ఆ ఆనందం రెట్టింపు అయింది. పని విషయంలో శేఖర్‌ కమ్ముల ఇచ్చిన కంఫర్ట్‌తో ఆయనతో ఎంతదూరమైనా ట్రావెల్‌ చేయాలనుంది. ఈ  సినిమా తర్వాత నటుడిగా ఎదిగాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు నెక్ట్స్‌ లెవల్‌ సినిమా ఇది. 


– ఇందులో మహిళలకు సంబంధించిన సున్నితమైన విషయాన్ని దర్శకుడు అద్భుతంగా చెప్పారు. జెండర్‌ బయాస్‌, క్యాస్ట్‌ డిస్ర్కిమినేషన్‌ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి కథ చెప్పాం. పల్లవి క్యారెక్టర్‌ ద్వారా ఈ విషయాన్ని చెబుతున్నాం. ఇందులో తెలంగాణ యాసలో మాట్లాడతాను. ఆ స్లాంగ్‌ కోసం చాలా ప్రాక్టీస్‌ చేశా. లాక్‌డౌన్‌ వల్ల యాస మరింత స్పష్టంగా నేర్చుకునేందుకు వీలు దొరికింది. 




– శేఖర్‌ గారి గత చిత్రాల్లో హీరోయిన్‌ క్యారెక్టర్‌కు ఎక్కువ పేరొస్తుంది. ఈ చిత్రంలో సాయిపల్లవితోపాటు నాకూ మంచి గుర్తింపు వస్తుంది. ఇద్దరి పాత్రలు సరిసమానంగా ఉంటాయి. సాయి పల్లవి అద్భుతమైన నటి. తనతో డాన్స్‌ చేయడం సవాలే! 


– ఈ మధ్యన ఓ సందర్భంలో సుకుమార్‌గారిని కలిసి మాట్లాడాను.నేచురల్‌ అప్రోచ్‌ ఉన్న సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోందనే విషయం మీద చర్చించుకున్నాం. సుకుమార్‌ గారు కూడా నాకు అదే సజెషన్‌ ఇచ్చారు. తను కూడా రంగస్థలం నుంచి ఇదే ఫార్మెట్‌లో సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. 


– మంచి కథ కుదిరితే ఇతర భాషల్లోనూ నటిస్తా. అమీర్‌ ఖాన్‌ గారితో ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన ప్రీ రిలీజ్‌కు వచ్చి మా సినిమా గురించి బాగా చెప్పారు. ఆయన అపాయింట్‌మెంట్‌ దొరికితే ‘లవ్‌ స్టోరి’ సినిమా చూపిస్తాం. 


ఈ మధ్యకాలంలో నాపై అసత్య వార్తలొచ్చాయి. వాటిని చూసి బాధపడ్డా. అలా ఎలా రాస్తారు అనుకున్నా. ఎన్ని వార్తలొచ్చినా వాస్తవాలను మాత్రమే ప్రజలు గర్తుంచుకుంటారు అనే విషయం తెలిసినప్పటి నుంచి నేను వాటిని పట్టించుకోవడం మానేశా. 



Updated Date - 2021-09-23T22:37:17+05:30 IST