సీనియర్ కథానాయకులూ జోరుగా సినిమాలు చేస్తున్నారు. సినిమా సినిమాకీ కొంచెం కూడా విరామం తీసుకోవడం లేదు. ఇప్పుడు నాగార్జున కూడా అంతే. ఆయన కథానాయకుడిగా ‘డెవిల్’ చిత్రం రూపుదిద్దుకంటోంది. ఆ తరవాత మోహన్ రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆయన కోసం మరో కథ కూడా సిద్ధమవుతోంది. యువ దర్శకుడు చందూ మొండేటి నాగ్ కోసం ఓ స్ర్కిప్టు రెడీ చేస్తున్నారు. ఇందులో నాగ్ని పోలీస్ అధికారిగా చూపించబోతున్నారట. ఈ విషయాన్ని చందూనే తెలిపారు. ‘‘నాగార్జునగారంటే నాకు చాలా ఇష్టం. ఆయన కోసం ఓ కథ తయారు చేస్తున్నా. ‘విక్రమ్’లా సీరియస్ సబ్జెక్ట్ అది. నాగార్జున పోలీస్ అధికారిగా కనిపిస్తారు. ఈ కథపై కసరత్తు చేస్తున్నా’’ అన్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ‘కార్తికేయ 2’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తరవాత నాగార్జునకి కథ చెప్పే అవకాశం ఉంది. కొత్త దర్శకులను ప్రోత్సహించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే నాగ్... ఈ ప్రాజెక్టుకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి.