‘దృశ్యం 2’.. మీనా స్థానంలో న‌టిస్తున్న‌దెవ‌రంటే?

మలయాళ సూపర్‌హిట్‌ మూవీ ‘దృశ్యం’. ఈ చిత్రం రెండో భాగం కూడా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. మోహన్‌లాల్‌, మీనా నటించిన ఈ చిత్రం తొలి భాగాన్ని తెలుగు, తమిళ భాషల్లోకి రీమేక్‌ చేశారు. తమిళంలో కమల్‌హాసన్‌, గౌతమి నటించారు. ఆ సమయంలో వీరిద్దరూ సహజీవనం చేసేవారు. కానీ, ఇపుడు వీరిద్దరూ విడిపోయారు. దీంతో ‘దృశ్యం2’ రీమేక్‌లో కమల్‌ సరసన నటించేందుకు పలువురు సీనియర్‌ నటీమణుల పేర్లను పరిశీలించి నటి నదియా పేరు ఖరారు చేసినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ వార్త నిజమైతే కమల్‌తో నదియా కలిసి నటించడం ఇదే తొలిసారి. ‘పాపనాశం 2’ పేరుతో ఈ చిత్రాన్ని తమిళం లోకి రీమేక్‌ చేయనున్నారు. ఇదిలావుండగా కమల్‌ చేతిలో ‘ఇండియన్ 2’ ప్రాజెక్టుతో పాటు.. లోకేష్‌ కనకరాజ్‌ తెరకెక్కించనున్న ‘విక్రమ్‌’ చిత్రాలు ఉన్నాయి. మరి ఈ రెండు చిత్రాలను పూర్తి చేసిన తర్వాత ‘పాపనాశం 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తారా.. లేదా? అన్నది తెలియాంటే మరికొంతకాలం ఆగాల్సిందే. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.