దోస్త్ అంటే నువ్వేరా...
ABN , First Publish Date - 2022-08-10T05:30:00+05:30 IST
ఉదయ్ శంకర్, జెన్నీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘నచ్చింది గర్ల్‌ఫ్రెండూ’. గురుపవన్ దర్శకత్వంలో

ఉదయ్ శంకర్, జెన్నీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘నచ్చింది గర్ల్‌ఫ్రెండూ’. గురుపవన్ దర్శకత్వంలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని ‘దోస్త్ అంటే నువ్వేరా, ఫ్రెండ్ అంటే నువ్వేరా’ అనే లిరికల్ వీడియోను హీరోలు నారా రోహిత్, శ్రీవిష్ణు విడుదల చేశారు. ‘‘నచ్చింది గర్ల్‌ఫ్రెండూ’ సినిమా బాగా వస్తోందని తెలిసింది. అట్లూరి నారాయణరావుగారు నిర్మాతగా మంచి విజయం అందుకోవాల’ని నారా రోహిత్ ఆకాంక్షించారు. ఈ చిత్రం కథ, కథనాలు ఆసక్తికరంగా ఉన్నాయి, గురుపవన్‌కు దర్శకత్వంలో మంచి ప్రతిభ ఉంది అని శ్రీవిష్ణు అన్నారు. గిప్టన్ ఎలియాస్ స్వరకల్పనలో రాహుల్ సిప్లిగింజ్ ఆలపించారు. మున్నా ఎస్డీ సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్రంలో సుమన్, పృథ్విరాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, ఇమ్మానుయేల్, మధునందన్ కీలకపాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీ: సిద్దం మనోహర్.