నా కుమారుడిది తమిళ కులం: హీరో విజయ్ తండ్రి
ABN , First Publish Date - 2021-09-15T02:31:44+05:30 IST
నా కుమారుడు విజయ్‌ని స్కూల్‌లో చేర్చే సమయంలో దరఖాస్తులో కులం అనే చోట ‘తమిళన్’ అనే పదంతో భర్తీ చేశాను. ఈ దరఖాస్తు స్వీకరించేందుకు పాఠశాల యాజమాన్యం ముందు సమ్మతించలేదు. ఈ అప్లికేషన్ స్వీకరించకుంటే పాఠశాల

తన కుమారుడి కులం తమిళన్ అని ప్రముఖ దర్శకుడు, విజయ్ తండ్రి ఎస్‌ఏ. చంద్రశేఖర్ పేర్కొన్నారు. వైట్ ల్యాంప్ ప్రొడక్షన్ నిర్మాణ సారథ్యంలో ఆంథోనీసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాయమ్’. విజయ్ విశ్వ, షైనీ హీరో హీరోయిన్లుగా పొన్‌వణ్ణన్, బోస్ వెంకట్, సీత, ఇళవరసు, తెన్నవన్, సెంది, ఎలిజబెత్, బెంజిమిన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. చదువుకునే విద్యార్థులకు కులాన్ని ఆపాదించడం వల్ల వారి జీవితాలు ఏ విధంగా దెబ్బతింటాయన్న అంశాన్ని కథాంశంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం తాజాగా చెన్నై నగరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ సినీ దర్శకులు ఎస్.ఏ. చంద్రశేఖర్, ఆర్వీ ఉదయకుమార్ సహా చిత్ర బృందం పాల్గొంది.
ఈ సందర్భంగా ఎస్.ఏ. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘‘విద్యార్థులపై కులం రంగును రుద్దడం భావ్యంకాదని సందేశమిచ్చేలా ఈ చిత్రాన్ని నిర్మించారు. నా కుమారుడు విజయ్‌ని స్కూల్‌లో చేర్చే సమయంలో దరఖాస్తులో కులం అనే చోట ‘తమిళన్’ అనే పదంతో భర్తీ చేశాను. ఈ దరఖాస్తు స్వీకరించేందుకు పాఠశాల యాజమాన్యం ముందు సమ్మతించలేదు. ఈ అప్లికేషన్ స్వీకరించకుంటే పాఠశాల మూయించేంత వరకు పోరాటం చేస్తానని చెప్పాను. దీంతో దరఖాస్తును స్వీకరించి విజయ్‌కు స్కూల్‌లో అడ్మిషన్ ఇచ్చారు. అప్పటి నుంచే విజయ్ సర్టిఫికెట్లలో కులం పేరు లేదు. మనం తలచుకుంటే మన పిల్లలను పాఠశాలల్లో చేర్చే సమయంలోనే ఈ కులానికి ముగింపు పలుకవచ్చు. ఇలా చేస్తే మరో 20 యేళ్ళలో కులం అనే మాట కనుమరుగైపోతుంది’’ చంద్రశేఖర్ అన్నారు. కాగా, త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి నాగ ఉదయన్ సంగీతం సమకూర్చారు.