మళ్ళీ వార్తల్లోకి మురళీధరన్ బయోపిక్

లెజెండరీ శ్రీలంకన్ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ బయోపిక్ పై ఆ మధ్య తమిళనాట వివాదం నడిచిన సంగతి తెలిసిందే. సినిమాకి ‘800’ అనే టైటిల్ ఖాయం చేశారు. మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతిని మురళీధరన్ పాత్రకు ఎంపిక చేయగా.. తమిళుడు అయి ఉండి.. తమిళయన్స్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మురళీధరన్ పాత్రను పోషిస్తావా అంటూ.. తమిళనాడు వాసులు విజయ్ సేతుపతి మీద మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా.. సేతుపతి ఫ్యామిలీని చంపేస్తామని కూడా బెదిరించారు. దాంతో ఈ ప్రాజెక్ట్ నుండి తాను తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించాడు విజయ్ సేతుపతి. అచ్చం మురళీధరన్ పోలికలతో ఉన్న విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 


అప్పటి నుంచి ఈ సినిమాపై ఒక్క అప్డేట్ కూడా రాలేదు. తాజాగా ఈ బయోపిక్ మళ్ళీ వార్తల్లో నిలుస్తోంది. ముురళీ ధరన్ తన కెరీర్ లో మొత్తం 800 వికెట్లు తీసి రికార్డు క్రియేట్ చేసిన కారణంగా సినిమాకి 800 అనే టైటిల్ ను ఖాయం చేశాడు దర్శకుడు యం.యస్.శ్రీపతి. ట్రైన్ మోషన్ పిక్చర్స్, డార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాలనుకున్న ఈ సినిమాలో ఇప్పుడు వేరే హీరోని ఎంపికచేసే ప్లాన్ లో ఉన్నాడు దర్శకుడు. అతడు మరెవరో కాదు ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్. హోటల్ ముంబై, ది గ్రీన్ నైట్, వెడ్డింగ్ గెస్ట్ లాంటి చిత్రాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు దేవ్. లండన్ లో సెటిలైన గుజరాతీ ఫ్యామిలీలో పుట్టిన దేవ్ అయితేనే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళుతుందని దర్శకుడు భావిస్తున్నాడట. అయితే ఈ సినిమా విడుదలకు తమిళనాట అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి మురళీధరన్ గా దేవ్ పటేల్ ఏ స్థాయిలో పెర్ఫార్మ్ చేస్తాడో చూడాలి. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.