‘ముసలోడికి దసరా పండగ’: ఆ దర్శకుడికి అంకితమిస్తున్నారు

Twitter IconWatsapp IconFacebook Icon
ముసలోడికి దసరా పండగ: ఆ దర్శకుడికి అంకితమిస్తున్నారు

రాజీనాయుడు, సీతమ్మవాళ్లె ఆశీస్సులతో.. రమణ ఫిలిమ్స్ (Ramana Films) పతాకంపై రమణవాళ్లె నిర్మించిన ద్విభాషా చిత్రం ‘ముసలోడికి దసరా పండుగ’ (Musalodiki Dasara Pandaga). సీనియర్ నటుడు  నాజర్ (Nasser) ప్రధాన పాత్రలో నటించగా.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu)  ఫేమ్ అంజలి (Anjali), ‘నువ్వు నేను’ (Nuvvu Nenu) ఫేమ్ అనిత (Anitha) హీరోయిన్లుగా నటించారు. కోవై సరళ, శరణ్య, సత్య ఇతర ముఖ్య పాత్రలలో నటించిన ఈ చిత్రానికి డి. మనోహర్ (D Manohar) దర్శకుడు. తాజాగా ఈ చిత్ర పోస్టర్,  ట్రైలర్‪ను చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన నాజర్ విడుదల చేశారు. 


ఈ సందర్భంగా నాజర్ మాట్లాడుతూ.. ‘‘ఇందులో నా పాత్ర చాలా కొత్తగా  ఉంటుంది. ఇప్పటి వరకు నన్ను అలా చూసి ఉండరు. చిత్ర ట్రైలర్ బావుంది. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులు రెండు గంటలసేపు అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఆడియో ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. త్వరలో సినిమా రిలీజ్‪కు సంబంధించి గ్రాండ్‪గా  ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని స్వర్గస్తులు, నాకు తండ్రి  సమానులైన ప్రముఖ దర్శకులు EVV సత్యనారాయణ (EVV SatyaNarayana)గారికి అంకితమిస్తున్నాము..’’ అని తెలిపారు. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.