మురుగదాస్ బర్త్‌డే స్పెషల్.. అభిమానులు మర్చిపోలేని ఐదు ఇండస్ట్రీ హిట్లు

ABN , First Publish Date - 2021-09-26T00:46:35+05:30 IST

సామాజిక నేపథ్యంతో కూడిన కమర్షియల్ చిత్రాలు తీసే దర్శకుడు ఏఆర్.మురుగదాస్. తమిళనాడులోనే కాదు, తెలుగురాష్ట్రాల్లోను ఆయనకు అశేషంగా అభిమానులున్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు ఇతర భాషాల్లోకి డబ్ అవుతుంటాయి.

మురుగదాస్ బర్త్‌డే స్పెషల్.. అభిమానులు మర్చిపోలేని ఐదు ఇండస్ట్రీ హిట్లు

చెన్నై: సామాజిక నేపథ్యంతో కూడిన కమర్షియల్ చిత్రాలు తీసే దర్శకుడు ఏఆర్.మురుగదాస్. తమిళనాడులోనే కాదు, తెలుగురాష్ట్రాల్లోను ఆయనకు అశేషంగా అభిమానులున్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు ఇతర భాషాల్లోకి డబ్ అవుతుంటాయి. అప్పుడప్పుడు వెండితెర మీద కూడా తళుక్కుమంటుటారు. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన ‘ నోటా ’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. ఈ రోజు (సెప్టెంబరు 25) ఏఆర్.మురుగదాస్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన దర్శకత్వం వహించిన, 5 హిట్ మూవీస్ వివరాలు మీకోసం..



రమణ: ఈ సినిమా 2002లో విడుదలైంది. విజయ్‌కాంత్, సిమ్రన్ కీలక పాత్రలు పోషించారు. ఈ  చిత్రం అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. చిరంజీవి ఈ సినిమాను ఠాగూర్ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోను ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం విశేషం.



తుపాకీ: మురుగదాస్, విజయ్ కాంబినేషన్‌కి ఉన్న క్రేజే వేరు. ఇద్దరూ కలిసి పనిచేసిన తొలి చిత్రమిది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా 2012లో విడుదలై బాక్స్‌ఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇళయదళపతి విజయ్ కెరీర్లో 100కోట్లు వసూలు చేసిన తొలి చిత్రమిది. అక్షయ్‌కుమార్ హాలీడే పేరుతో బాలీవుడ్‌లో ఈ సినిమాను రీమేక్ చేశారు. 



గజినీ: సూర్య, ఆసిన్ ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2005లో విడుదలైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్‌ఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాను అల్లుఅరవింద్ అదే పేరుతో ఆమీర్‌ఖాన్‌తో రీమేక్ చేశారు.  బాక్స్‌ఫీస్ వద్ద 100కోట్లు కలెక్ట్ చేసిన తొలి బాలీవుడ్ చిత్రమిదే.



కత్తి: తుపాకీ విజయానంతరం మురుగదాస్, విజయ్ కలిసి మరొసారి కలిసి పనిచేశారు. సమంత ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా 2014లో విడుదలైంది. బాలీవుడ్ నటుడైన నీల్‌ నితిన్ ముఖేశ్ ఈ చిత్రంలో విలన్ గా నటించారు. బాక్స్‌ఫీస్ వద్ద ఈ చిత్రం 130 కోట్లను వసూలు చేసింది. చిరంజీవి ఖైదీ నెం-150 పేరుతో ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో రీమేక్ చేశారు.



సర్కార్: విజయ్, కీర్తిసురేశ్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2018లో విడుదలైంది. విదేశాల నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకునే వ్యక్తిగా ఈ సినిమాలో విజయ్ కనిపిస్తారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో ఈ సినిమాలో కనిపించారు.  



Updated Date - 2021-09-26T00:46:35+05:30 IST