బ్రేకింగ్ న్యూస్: డ్రగ్స్ కేసులో Aryan Khan కు తప్పని నిరీక్షణ.. షారూఖ్ ఫ్యామిలీలో టెన్షన్..!

ABN , First Publish Date - 2021-10-27T00:11:10+05:30 IST

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. బాంబే హైకోర్టులో కూడా ఆయనకు ఇంకా బెయిల్ దక్కలేదు. బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి...

బ్రేకింగ్ న్యూస్: డ్రగ్స్ కేసులో Aryan Khan కు తప్పని నిరీక్షణ.. షారూఖ్ ఫ్యామిలీలో టెన్షన్..!

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. బాంబే హైకోర్టులో కూడా ఆయనకు ఇంకా బెయిల్ దక్కలేదు. బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు తిరిగి విచారణ ప్రారంభమవ్వనుంది. కింగ్ ఖాన్ వారసుడ్ని డ్రగ్స్ కేసులో అక్టోబర్ మూడో తారీఖున ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జైల్లోనే గడిపారు. ఓ స్టార్ హీరో తనయుడు ఇన్ని రోజుల పాటు జైల్లో ఉండాల్సి రావడంపై బాలీవుడ్‌లోనూ, అటు అధికార, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమయింది. అదే సమయంలో ఈ కేసును స్వయంగా పర్యవేక్షించిన ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే కూడా నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు. బెయిల్ ఇప్పించడం కోసం లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్టుగా ఆయనపై తాజాగా పలు ఆరోపణలు కూడా వచ్చాయి.


వాస్తవానికి ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అవగానే.. మొదట మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కానీ సాంకేతిక కారణాల వల్ల మేజిస్ట్రేట్ కోర్టు ఆ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇవ్వడం అనేది మేజిస్ట్రేట్ కోర్టు పరిధిలో లేనందువల్ల ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ఆ సమయంలో రద్దయింది. ఆ తర్వాత సెప్టెంబర్ 13, 14వ తారీఖుల్లో ప్రత్యేక కోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రత్యేక కోర్టులో ఆర్యన్ ఖాన్ తరపున సీనియర్ లాయర్ అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు. రెండ్రోజుల పాటు ఇరు పక్షాల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 20వ తారీఖున తీర్పును వెల్లడింది. బెయిల్ పిటిషన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 


దీంతో ఆ మరుసటి రోజే ముంబై హైకోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ దాఖలు అయింది. ఈ బెయిల్ పిటిషన్‌పై మంగళవారం వాదనలు జరిగాయి. అటు ఎన్సీబీ, ఇటు ఆర్యన్ ఖాన్ తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. తమ క్లయింట్ ఒక అతిథిగానే వెళ్లాడనీ.. అతడి వద్ద ఏమీ దొరకలేదని ముకుల్ రోహత్గీ చెప్పుకొచ్చరు. అన్ని వాదనలు విన్న హైకోర్టు.. చివరకు ఆర్యన్ ఖాన్‌ బెయిల్ పిటిషన్‌ పై తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.  దీంతో అక్టోబర్ 3వ తారీఖు నుంచి జైల్లోనే గడుపుతున్న ఆర్యన్ ఖాన్‌ ఇంకెంత కాలం నిర్భందంలో ఉంటాడో తెలియని సందిగ్ధ పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. బెయిల్ విషయంలో బుధవారం మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది... 

Updated Date - 2021-10-27T00:11:10+05:30 IST