‘బంగార్రాజు’కు ముహూర్తం కుదిరింది!

ABN , First Publish Date - 2021-08-02T17:30:47+05:30 IST

అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున తన తదుపరి చిత్రంగా బంగార్రాజును తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈయన హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొంద‌నుంది.

‘బంగార్రాజు’కు ముహూర్తం కుదిరింది!

అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున తన తదుపరి చిత్రంగా బంగార్రాజును తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈయన హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొంద‌నుంది. ఇందులో నాగ‌చైత‌న్య కూడా న‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం. క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కించ‌నున్న ఈ చిత్రంలో నాగార్జున స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా, చైత‌న్య జోడీ కృతి శెట్టి క‌నిపించ‌నుంది. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాను ఆగ‌స్ట్ 20 నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్ల‌బోతున్నారు. సినిమా కోసం ఓ సెట్‌ను కూడా వేస్తున్నార‌ట‌. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ని కూడా టాక్‌. 

Updated Date - 2021-08-02T17:30:47+05:30 IST