'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్': రిలీజ్ డేట్ మారింది.

ABN , First Publish Date - 2021-09-26T17:54:13+05:30 IST

అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ఈ మూవీ రిలీజ్ డేట్ మారింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్': రిలీజ్ డేట్ మారింది.

అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ఈ మూవీ రిలీజ్ డేట్ మారింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి నిర్మించారు. ప్రచార చిత్రాలతో పాటు ఇటీవల విడుదలైన 'లెహరాయి' సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని సినిమా మీద అంచనాలు పెంచాయి. 


అయితే ఈ మూవీని అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. అఫీషియల్‌గా కన్‌ఫర్మేషన్ ఇస్తూ ఓ పోస్టర్ కూడా వదిలారు. అయితే ప్రకటించిన తేదీన ఈ సినిమా థియేటర్లకు రావడం లేదు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన రిలీజ్ చేయాలనే నిర్ణయానికి చిత్రబృందం వచ్చింది. దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇస్తూ మారిన రిలీజ్ డేట్‌తో కొత్త పోస్టర్‌ను వదిలారు. కాగా ఇదేరోజున నాగ శౌర్య, రీతూ వర్మ నటించిన 'వరుడు కావలెను' కూడా విడుదలవుతోంది. 



Updated Date - 2021-09-26T17:54:13+05:30 IST