Akhil: రీషూట్స్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’..!

ABN , First Publish Date - 2021-07-24T21:55:22+05:30 IST

స‌రైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ అక్కినేనిని వెండితెరపై చూడాలనుకుంటున్న అక్కినేని అభిమానులు మ‌రికాస్త వెయిటింగ్ మోడ్‌లో ఉండాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అదేంటి?

Akhil: రీషూట్స్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’..!

స‌రైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ అక్కినేనిని వెండితెరపై చూడాలనుకుంటున్న అక్కినేని అభిమానులు మ‌రికాస్త వెయిటింగ్ మోడ్‌లో ఉండాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అదేంటి? అఖిల్, పూజా హెగ్డే జంట‌గా న‌టిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది క‌దా! థియేట‌ర్స్ ప‌రంగా సాధార‌ణ ప‌రిస్థితులు రాగానే సినిమాను విడుద‌ల చేస్తారుగా! అనే సందేహం రావ‌చ్చు. కానీ.. ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న స‌మాచారం ప్ర‌కారం.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ను రీషూట్ చేస్తున్నారని తెలుస్తోంది. రీసెంట్‌గా సినిమాను చూసిన మేక‌ర్స్‌కు కొన్ని సీన్స్ ఎఫెక్టివ్‌గా అనిపించ‌లేదని, దీంతో.. వాళ్లు, ఆల‌స్య‌మైనా ప‌రావాలేదు కానీ.. తొంద‌ర‌ప‌డ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుని బాగాలేద‌నిపించిన స‌న్నివేశాల‌ను రీషూట్ చేస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. 


మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను నిర్మించిన నిర్మాత బన్నీ వాసు, మరో నిర్మాత, ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated Date - 2021-07-24T21:55:22+05:30 IST