దృశ్యం సినిమాలో నటనతో అదరగొట్టిన Mohanlal.. కానీ ఈ సినిమా ఆఫర్ మొదట ఏ స్టార్ హీరో దగ్గరకు వెళ్లిందంటే..

బెంగళూరు: దృశ్యం సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని కురిపించింది. మోహన్‌లాల్ నటించిన ఈ చిత్రం అభిమానులను అలరించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. జీతుజోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్, టాలీవుడ్‌లోకి రీమేక్ అయింది. ఈ సినిమాలో మోహన్‌లాల్ తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. కానీ, మొదట ఈ సినిమా ఆఫర్  మోహన్‌లాల్‌కు బదులు వేరే స్టార్ హీరో దగ్గరకు వెళ్లింది. 


మలయాళ స్టార్‌హీరో మమ్ముట్టి దగ్గరకు మొదట ఈ కథ వెళ్లింది. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆయన ఈ సినిమాను అంగీకరించలేదు. కానీ, ఈ సినిమాకు తన పూర్తి మద్దతును ప్రకటించారు. తన అభిమానులందరూ  తప్పకుండా ఈ చిత్రాన్ని వీక్షించాలన్నారు. మమ్ముట్టి అంచనాలకు తగినట్టుగానే 2013లో విడుదలైన ఈ సినిమా మాలీవుడ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. 


ఇవి కూడా చదవండిImage Caption

ప్రభుత్వ హాస్టల్ నుంచి 10 మంది బాలలు పరారీ..మమ్ముట్టి, మోహన్‌లాల్‌కు UAE బంపరాఫర్.. ఈ మలయాళ టాప్ హీరోలిద్దరికీ..

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.