మహేశ్‌బాబు సినిమాలో మోహన్ బాబు?

ABN , First Publish Date - 2022-01-25T14:38:46+05:30 IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాకి రెడీ అవుతాడు. ‘అతడు, ఖలేజా’ తర్వాత మళ్ళీ ఈ కాంబో రిపీట్ కానుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నుంచి షూట్ ను ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా మహేశ్ పై సోలో సాంగ్ ను, ఓ ఫైట్ ను చిత్రీకరిస్తారట. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మహేశ్‌బాబు సినిమాలో మోహన్ బాబు?

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాకి రెడీ అవుతాడు. ‘అతడు, ఖలేజా’ తర్వాత మళ్ళీ ఈ కాంబో రిపీట్ కానుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నుంచి షూట్ ను ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా మహేశ్ పై సోలో సాంగ్ ను, ఓ ఫైట్ ను చిత్రీకరిస్తారట. ఇక  ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో విలక్షణ నటుడు మోహన్ బాబు ఓ కీలక పాత్ర పోషించబోతున్నారట. మహేశ్ కు మామయ్య గా చాలా వైవిధ్యంగా ఆ పాత్రను డిజైన్ చేశారట త్రివిక్రమ్. 


1989 లో కృష్ణ హీరోగా,  ఆయన  దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో మోహన్ బాబు విలన్ గా నటించారు. ఇందులో మహేశ్ బాబు బాలనటుడుగా ద్విపాత్రాభినయం చేశారు. మళ్ళీ 33 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మరోసారి మహేశ్ చిత్రంలో మోహన్ బాబు నటించనుండడం విశేషమని చెప్పాలి. ‘మహర్షి, సరిలేరు నీకెవ్వురు’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన మహేశ్ బాబు, ‘అరవింద సమేత, అల వైకుంఠపురములో’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు మామూలుగా లేవు. మరి ఈ సినిమాకి మోహన్ బాబు ప్రెజెన్స్ ఏ స్థాయిలో హైలైట్ అవుతుందో చూడాలి. 

Updated Date - 2022-01-25T14:38:46+05:30 IST