యూనివర్సిటీ స్థాపించనున్న మోహన్ బాబు

టాలీవుడ్ విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీని స్థాపించబోతున్నట్టు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. ఇప్పటికే ఆయన  తిరుపతి హెడ్డాఫీస్ గా శ్రీవిద్యానికేతన్ పేరుతో వివిధ ప్రాంతాల్లో స్కూల్స్ అండ్ కాలేజెస్ ను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఉత్తమ విద్యకు, క్రమశిక్షణకు మారుపేరుగా ఆ విద్యాసంస్థలు నడుస్తున్నాయి. వీటిని మరింత విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన త్వరలోనే యూనివర్సిటీని స్థాపించబోతున్నట్టు తెలిపారు. యం.బీ.యూ గా దీనికి నామకరణం చేశారు. 


‘చిన్న విత్తనాలతో పెరిగిన శ్రీవిద్యానికేతన్ ఇప్పుడు కల్పవృక్షంగా మారింది. 30 ఏళ్ళ మీ నమ్మకం ఇప్పుడు నన్ను విశ్వవ్యాప్తమైన విద్యవైపుకు పురిగొల్పుతోంది. ఆ కృతజ్ఞతతోనే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని స్థాపిస్తున్నాను. మీ ప్రేమే నా బలం.  నా ఈ కలకు కూడా మీరు సహకారం అందిస్తారని నమ్ముతున్నాను. నా తల్లిదండ్రులు, అభిమానుల ఆశీస్సులతో నేను ఈ విషయాన్ని వినయపూర్వకంగా ప్రకటిస్తున్నాను’.. అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.