Mohan Babu: పవన్‌ ప్రతి మాటకు సమాధానం చెబుతా

ABN , First Publish Date - 2021-09-26T22:37:56+05:30 IST

శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘రిపబ్లిక్‌’ ప్రీరిలీజ్‌ వేడుకలో పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మోహన్‌బాబు స్పందించారు. వైకాపా ప్రభుత్వం థియేటర్‌లను మూసి వేస్తున్నప్పుడు మోహన్‌బాబుగారు కూడా మాట్లాడాలి. ఎందుకంటే ‘వైఎస్‌ కుటుంబీకులు మా బంధువులు’ అని మీరు చెబుతుంటారు కదా! చిత్ర పరిశ్రమను హింసించొద్దని వారికి సెలవివ్వండి.

Mohan Babu: పవన్‌ ప్రతి మాటకు సమాధానం చెబుతా

పవన్‌ వ్యాఖ్యలకు మోహన్‌బాబు కౌంటర్‌

పవన్‌.. నన్ను మెల్లగా లాగావ్‌..

ప్రతిమాటకు సమాధానం చెబుతా

మొదట నీ అమూల్యమైన ఓటు విష్ణుకి వెయ్యి..

శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘రిపబ్లిక్‌’ ప్రీరిలీజ్‌ వేడుకలో పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మోహన్‌బాబు స్పందించారు. వైకాపా ప్రభుత్వం థియేటర్‌లను మూసి వేస్తున్నప్పుడు మోహన్‌బాబుగారు కూడా మాట్లాడాలి. ఎందుకంటే ‘వైఎస్‌ కుటుంబీకులు మా బంధువులు’ అని మీరు చెబుతుంటారు కదా! చిత్ర పరిశ్రమను హింసించొద్దని వారికి సెలవివ్వండి. కావాలంటే ‘పవన్‌కల్యాణ్‌ను బ్యాన్‌ చేసుకోండి అతను, మీరూ తేల్చుకోండి’ అని అర్థమయ్యేలా ఆ ప్రభుత్వానికి చెప్పండి. ఈరోజు చిత్ర పరిశ్రమకు పెట్టిన నియమ, నిబంధనలు రేపు మీ విద్యానికేతన్‌కు కూడా పెట్టొచ్చు. ఇది కేవలం మోహన్‌బాబుగారికే కాదు. అందరికీ చెబుతున్నా’’ అని పవన్‌ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా మోహన్‌బాబు ట్వీట్‌ చేశారు. 


‘‘నా చిరకాల మిత్రుని తమ్ముడైన పవన్‌కల్యాణ్‌ నువ్వు నాకంటే చిన్నవాడివి. అందుకని ఏకవచనంతో సంభోదించాను. అది తప్పేమీకాదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్‌. సంతోషమే. ఇప్పుడు ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడన్న సంగతి మీకు తెలిసిందే. అక్టోబరు 10వ తేదీన ఎలక్షన్స్‌ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకీ నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతా. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని.. నీ అమూల్యమైన ఓటును నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి అతని ప్యానల్‌కి వేసి వాళ్లని గెలిపించాలని కోరుకుంటున్నా. థ్యాంక్యూ వెరీ మచ్‌’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు. 




Updated Date - 2021-09-26T22:37:56+05:30 IST