మరీ ఇంత అందమేంటి సిన్ని.. సిన్ని..

ABN , First Publish Date - 2022-08-13T06:07:15+05:30 IST

దివంగత నటి, దర్శకురాలు విజయనిర్మల మనవడు శరణ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ కింగ్‌’.

మరీ ఇంత అందమేంటి సిన్ని.. సిన్ని..

దివంగత నటి, దర్శకురాలు విజయనిర్మల మనవడు శరణ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ కింగ్‌’. బి.ఎన్‌.రావు నిర్మాత. శశిధర్‌ చావలి దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం నుంచి ‘మరీ ఇంత అందమేంటి సిన్ని.. సిన్ని..’ అనే పాటని శుక్రవారం విడుదల చేశారు. మణిశర్మ స్వర పరిచిన గీతమిది. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. భాస్కరభట్ల రవికుమార్‌ రచించారు. ‘‘యూత్‌ ఫుల్‌గా సాగే గీతమిది. వినగానే అందరికీ నచ్చేస్తుంది. మణిశర్మ అద్భుతమైన ట్యూన్‌ ఇచ్చారు. రాహుల్‌ పాడిన విధానం ఆకట్టుకుంటుంద’’ని దర్శక నిర్మాతలు తెలిపారు. నిష్కల, ఊర్వీ సింగ్‌, మురళీ శర్మ. తనికెళ్ల భరణి, సునీల్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు నటించారు. సహ నిర్మాత: రవికిరణ్‌ చావలి. 

Updated Date - 2022-08-13T06:07:15+05:30 IST