'మిషన్ ఇంపాజిబుల్': డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ..!

ABN , First Publish Date - 2022-04-21T13:37:20+05:30 IST

'మిషన్ ఇంపాజిబుల్'.. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తాప్సీ తెలుగులో నటించిన సినిమా ఇది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వ‌రూప్ ఆర్ఎస్‌జె తెరకెక్కించిన

'మిషన్ ఇంపాజిబుల్': డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ..!

'మిషన్ ఇంపాజిబుల్'.. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తాప్సీ తెలుగులో నటించిన సినిమా ఇది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వ‌రూప్ ఆర్ఎస్‌జె తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కాగా, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. 


క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏప్రిల్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు తీసుకువస్తున్నారు. ఈ మూవీలో హర్ష్ రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ మొలుగు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మార్క్ కె రాబిన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. చూడాలి మరి తాప్సీ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో. 

Updated Date - 2022-04-21T13:37:20+05:30 IST