మిర్జాపూర్ నటుడి మృతి

ABN , First Publish Date - 2021-12-03T00:03:38+05:30 IST

సూపర్ 30, దంగల్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు సుపరిచితులైన నటుడు బ్రహ్మ స్వరూప్ మిశ్రా. అమెజాన్ ప్రైమ్‌లో

మిర్జాపూర్ నటుడి మృతి

సూపర్ 30, దంగల్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు సుపరిచితులైన నటుడు బ్రహ్మ స్వరూప్ మిశ్రా. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైన మిర్జాపూర్ వెబ్‌సిరీస్‌తో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తాజాగా అతడు అకాల మరణం చెందాడు. మిర్జాపూర్ వెబ్‌సిరీస్ లో మున్నా భయ్యాకు సహాయకుడిగా బ్రహ్మ స్వరూప్ మిశ్రా నటించాడు.


వర్సోవాలోని  సోసైటీలో ఒక ఇంటిలో అతడు అద్దెకుండేవాడు. గత 4 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాడు. అతడి నివాసం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వీరు చేరుకునే సమయానికి ఆ ఇంటికి తాళం వేసి ఉంది. అనంతరం డూప్లికేట్ కీ సహాయంతో ఇంటిని తెరిచారు. ఇంటిని తెరవగానే అతడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభించింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మధ్యప్రదేశ్‌లో నివసించే అతడి సోదరుడు సందీప్‌కి సమాచారం అందించారు. బ్రహ్మ స్వరూప్ మిశ్రా గుండెపోటుతో మరణించాడని వైద్యులు నిర్ధారించారు.

Updated Date - 2021-12-03T00:03:38+05:30 IST