డిసెంబర్ 24న ఓటీటీలో వస్తోన్న సూపర్ హీరో మూవీ

ABN , First Publish Date - 2021-09-23T19:40:43+05:30 IST

ఆహా ఓటీటీలో ‘కళ, అండ్ ఆస్కార్ గోస్ టు, లూకా, మాయానది’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు మలయాళ యంగ్ హీరో టోవినో థామస్. ఆయన ప్రస్తుతం నటిస్తోన్న సూపర్ హీరో మూవీ ‘మిన్నల్ మురళి’ (మెరుపు మురళి).

డిసెంబర్ 24న ఓటీటీలో వస్తోన్న సూపర్ హీరో మూవీ

ఆహా ఓటీటీలో ‘కళ, అండ్ ఆస్కార్ గోస్ టు, లూకా, మాయానది’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు మలయాళ యంగ్ హీరో టోవినో థామస్.  ఆయన ప్రస్తుతం నటిస్తోన్న సూపర్ హీరో మూవీ ‘మిన్నల్ మురళి’ (మెరుపు మురళి). ఒక సాధారణ యువకుడు ఆకాశంలోని మెరుపు వల్ల సూపర్ హీరోగా ఎలా మారాడు అన్నదే ఈ సినిమా కథాంశం. మలయాళ యువనట దర్శకుడు బసిల్ జోసెఫ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ పై  సోఫియా పాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి.. ఈ రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 24న నెట్ ఫ్లిక్స్ లో మలయాళంతో పాటు  తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. 


ఇంతకు ముందే విడుదలైన ‘మిన్నల్ మురళి’ టీజర్ .. ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.  టోవినో థామస్, అజు వర్గీస్, హరిశ్రీ అశోకన్, గురు సోమసుందరం తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి షాన్ రహమాన్ సంగీతం సమకూర్చుతుండగా.. సుశిన్ శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ అందిస్తున్నారు. నిజానికి లాస్టియరే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా చాలా సార్లు విడుదలను వాయిదా వేసుకుంది. ఎట్టకేలకు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారు మేకర్స్. 

Updated Date - 2021-09-23T19:40:43+05:30 IST