నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్ హీరో చిత్రం ‘మిన్నల్ మురళి’

ABN , First Publish Date - 2021-09-06T22:51:36+05:30 IST

అతీంద్రియ శక్తులను ఉపయోగించి దుష్టశక్తుల నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడేది సూపర్ హీరోలు. అలాంటి సూపర్ హీరోలను ఎవరు ఇష్టపడరు? అందరూ ఇష్టపడతారు. అలాంటి కథాంశంతోనే తెరకెక్కిన చిత్రం ‘మిన్నల్ మురళి’. ఈ ఏడాది అందరిలో

నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్ హీరో చిత్రం ‘మిన్నల్ మురళి’

అతీంద్రియ శక్తులను ఉపయోగించి దుష్టశక్తుల నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడేది సూపర్ హీరోలు. అలాంటి సూపర్ హీరోలను ఎవరు ఇష్టపడరు? అందరూ ఇష్టపడతారు. అలాంటి కథాంశంతోనే తెరకెక్కిన చిత్రం ‘మిన్నల్ మురళి’. ఈ ఏడాది అందరిలో అమితాసక్తిని పెంచిన మలయాళ చిత్రమిది. త్వరలో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. బేసిల్ జోసెఫ్ దర్శకత్వంలో వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్‌పై సోఫియా పాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళ స్టార్ టోవినో థామస్ ఇందులో మిన్నల్ మురళి అనే సూపర్ హీరోగా కనిపించనున్నారు. ఇందులో సాధారణ వ్యక్తి అయిన మురళి అనుకోకుండా ఓ పెద్ద లైటింగ్‌లో చిక్కుకుంటాడు. దాని కారణంగా అతనికి కొన్ని ప్రత్యేక శక్తులు వచ్చి అతను సూపర్ హీరో మిన్నల్ మురళిగా ఎలా మారాడనేదే కథ. ఇందులో గురు సోమ సుందరం, హరిశ్రీ అశోకన్, అంజు వర్గీస్ కీలక పాత్రల్లో నటించారు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రం అనువాదమవుతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.


ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా ఫిల్మ్స్ అండ్ లైసెన్సింగ్ డైరెక్టర్ ప్రతీక్షా రావు మాట్లాడుతూ.. ‘‘మిన్నల్ మురళి అనే మలయాళ చిత్రం విలక్షణమైన కథనంతో, అద్భుతమైన మేకింగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇలాంటి వైవిధ్యభరితమైన మలయాళ కథలతో మా మూవీస్ పరిధిని పెంచుకుంటున్నాం. ఈ క్రమంలో మిన్నల్ మురళి అనే సూపర్ హీరో సినిమాను మా నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ప్రేక్షకులకు అందించడమనేది చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. మా లోకల్ సూపర్ హీరోగా నటించిన టోవినో థామస్ ప్రతి ఒక ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాడనడంలో సందేహం లేదు’’ అన్నారు. 



Updated Date - 2021-09-06T22:51:36+05:30 IST