యాక్షన్ ఎలిమెంట్స్‌తో 'గని' టీజర్..

ABN , First Publish Date - 2022-01-19T17:44:07+05:30 IST

యాక్షన్ ఎలిమెంట్స్‌తో విడుదలైన 'గని' టీజర్ మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ లేటెస్ట్ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకుడు.

యాక్షన్ ఎలిమెంట్స్‌తో 'గని' టీజర్..

యాక్షన్ ఎలిమెంట్స్‌తో విడుదలైన 'గని' టీజర్ మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ లేటెస్ట్ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకుడు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్ ఆకట్టుకోగా ఇటీవల వచ్చిన తమన్నా స్పెషల్ సాంగ్‌కు విశేష స్పందన లభించింది. ఇక ఈరోజు వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ అభిమానులతో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై  అల్లు బాబి, సిద్దు ముద్ద కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు.  



Updated Date - 2022-01-19T17:44:07+05:30 IST