‘హరిహర వీరమల్లు’ కోసం అదిరిపోయే సెట్స్

ABN , First Publish Date - 2022-01-21T17:52:00+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘భీమ్లానాయక్’ చిత్రం విడుదలకు రెడీ అవుతుండగా.. భారీ జానపద చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. క్రిష్ దర్శకత్వంలో, ఏ.యం.రత్నం, ఏ. దయాకరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 17వ శతాబ్దంలోని మొఘలాయిల పరిపాలన నేపథ్యంలోని ఆసక్తికరమైన కథాంశంతో మూవీ రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ ‘వీరమల్లు’ అనే పవర్ ఫుల్ డెకాయిట్ గా నటిస్తుండగా.. యువరాణిగా నిధి అగర్వాల్ ఆకట్టుకోనుంది. ఇప్పటికే 60శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది చిత్రం.

‘హరిహర వీరమల్లు’ కోసం అదిరిపోయే సెట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘భీమ్లానాయక్’ చిత్రం విడుదలకు రెడీ అవుతుండగా..  భారీ జానపద చిత్రం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ దశలో ఉంది. క్రిష్ దర్శకత్వంలో, ఏ.యం.రత్నం, ఏ. దయాకరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 17వ శతాబ్దంలోని మొఘలాయిల పరిపాలన నేపథ్యంలోని ఆసక్తికరమైన కథాంశంతో మూవీ రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ ‘వీరమల్లు’ అనే పవర్ ఫుల్ డెకాయిట్ గా నటిస్తుండగా.. యువరాణిగా నిధి అగర్వాల్ ఆకట్టుకోనుంది. ఇప్పటికే 60శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది చిత్రం. కరోనా కారణంగా బ్యాలెన్స్ షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.


ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా అదిరిపోయే సెట్స్ వేయబోతున్నారు. ఢిల్లీలోని చాందినీ చౌక్ ను రీక్రియేట్ చేయబోతున్నారు. ఈ సినిమాకిది ప్రత్యేక ఆకర్షణ కానుంది. కోహినూర్ వజ్రం నేపథ్యం కూడా సినిమాకి హైలైట్ కానుందని తెలుస్తోంది. అర్జున్ రామ్‌పాల్, నర్గీస్ ఫక్రీ, ఆదిత్యమీనన్, శుభలేఖ సుధాకర్, పూజితా పొన్నాడ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి కాగా.. పవర్ స్టార్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ను తిరిగి మొదలుపెట్టనున్నారు. అలాగే.. ‘భవదీయుడు భగత్ సింగ్’  షూటింగ్ ను కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నారని టాక్. 

Updated Date - 2022-01-21T17:52:00+05:30 IST