Kriti Sanon - Mimi: ప్ర‌భాస్ హీరోయిన్‌కు షాక్‌.. ఆన్‌లైన్‌లో సినిమా లీక్‌

ABN , First Publish Date - 2021-07-27T19:55:22+05:30 IST

కృతి సనన్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘మిమి’. ఈ సినిమాను జూలై 30న విడుద‌ల చేయాల‌ని నెట్‌ఫ్లిక్స్ భావించి ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. అయితే సినిమాను దెయ్యంలా ప‌ట్టి పీడిస్తున్న పైర‌సీ భూతం స‌ద‌రు...

Kriti Sanon - Mimi: ప్ర‌భాస్ హీరోయిన్‌కు షాక్‌.. ఆన్‌లైన్‌లో సినిమా లీక్‌

మ‌హేశ్ ‘నేనొక్క‌డినే’ చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ కృతిస‌న‌న్‌కు బాలీవుడ్‌లో అవ‌కాశాలు రావ‌డంతో అక్క‌డే సెటిలైంది. ఇప్పుడు ఏకంగా ప్ర‌భాస్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్‌’లో సీత పాత్ర‌లో క‌నిపించ‌నుంది. కాగా.. ఈమె టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘మిమి’. ఈ సినిమాను జూలై 30న విడుద‌ల చేయాల‌ని నెట్‌ఫ్లిక్స్ భావించి ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. అయితే సినిమాను దెయ్యంలా ప‌ట్టి పీడిస్తున్న పైర‌సీ భూతం స‌ద‌రు డిజిట‌ల్ సంస్థ‌కు పెద్ద షాకే ఇచ్చింది. ‘మిమి’ సినిమాను పైర‌సీ వెబ్‌సైట్స్ నాలుగు రోజుల ముందే త‌మ వెబ్‌సైట్స్‌లో రిలీజ్ చేయ‌డంతో నెట్‌ఫ్లిక్స్ అనుకున్న స‌మ‌యం కంటే నాలుగు రోజుల ముందే త‌మ సినిమాను విడుద‌ల చేసుకోవాల్సి వ‌చ్చింది. సినిమాలో కృతిస‌న‌న్ న‌ట‌న బావుందంటూ అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. ల‌క్ష్మణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 



Updated Date - 2021-07-27T19:55:22+05:30 IST