‘లైగర్‌’లో మైక్‌ టైసన్‌!

ABN , First Publish Date - 2021-09-27T23:22:27+05:30 IST

విజయ్‌ దేవరకొండ హీరోగా పూర్తి జగన్నాథ్‌ రూపొందిస్తున్న ‘లైగర్‌’ చిత్రం నుంచి కొత్త అప్‌డేట్‌ వచ్చింది. బాక్సింగ్‌ లెజెండ్‌ మైక్‌టైసన్‌ మొదటి సారిగా ఈ సినిమా ద్వారా ఇండియన్‌ స్ర్కీన్‌కు పరిచయం కాబోతోన్నారు. ‘‘ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్‌, బాక్సింగ్‌లో లెజెండ్‌ మైక్‌ టైసన్‌ గారిని ‘లైగర్‌’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది.

‘లైగర్‌’లో మైక్‌ టైసన్‌!

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న ‘లైగర్‌’ చిత్రం నుంచి కొత్త అప్‌డేట్‌ వచ్చింది. బాక్సింగ్‌ లెజెండ్‌ మైక్‌టైసన్‌ మొదటి సారిగా ఈ సినిమా ద్వారా ఇండియన్‌ స్ర్కీన్‌కు పరిచయం కాబోతోన్నారు. ‘‘ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్‌, బాక్సింగ్‌లో లెజెండ్‌ మైక్‌ టైసన్‌ గారిని ‘లైగర్‌’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ఆయనతో జర్నీ ప్రారంభించబోతున్నాం. ది బ్యాడెస్ట్‌ మ్యాన్‌ ఆన్‌ ది ప్ల్లానెట్‌, బాక్సింగ్‌ గాడ్‌, ది లెజెండ్‌, ది బీస్ట్‌, ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ ఐరన్‌ మైక్‌ టైసన్‌’ అని విజయ్‌ దేవరకొండ ట్వీట్‌ చేశారు. మిక్స్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ఎంతో నైపుణ్యం కలిగిన ఐరన్‌ మైక్‌ పాత్రలో ఆయన కనిపించబోతోన్నారు. ఆయన రాకతో ఈ చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిని మించిందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో హై ఆక్టేన్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తోంది. బ్లడ్‌ స్వెట్‌ వయలెన్స్‌ అనే క్యాప్షన్‌తో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. థాయిలాండ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ కెచ్చా యాక్షన్‌ సీక్వెన్స్‌ కంపోజ్‌  చేస్తున్నారు. 






Updated Date - 2021-09-27T23:22:27+05:30 IST