‘ఎఫ్3’పై ఎంతో నమ్మకంగా ఉన్నానంటోన్న యంగ్ బ్యూటీ

ABN , First Publish Date - 2022-05-01T02:29:17+05:30 IST

బ్లాక్‪బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) చిత్రాలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఆయన చిత్రాలు ప్రేక్షకులను మ్యాగ్జిమమ్ ఎంటర్ టైన్ చేస్తాయి. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని

‘ఎఫ్3’పై ఎంతో నమ్మకంగా ఉన్నానంటోన్న యంగ్ బ్యూటీ

బ్లాక్‪బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) చిత్రాలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఆయన చిత్రాలు ప్రేక్షకులను మ్యాగ్జిమమ్ ఎంటర్ టైన్ చేస్తాయి. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‪ని జోడించి.. వినోదాత్మకంగా చిత్రాలను రూపొందించడంలో అనిల్ నేర్పరి. ఇప్పుడాయన నుండి ‘ఎఫ్ 3’ (F3) చిత్రం రాబోతోంది. ‘ఎఫ్ 2’ భారీ విజయం తర్వాత వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ‘ఎఫ్ 2’ చిత్రంలో హనీ పాత్రలో యంగ్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా (mehreen pirzadaa) మేనరిజం, అమాయకత్వం, అల్లరి.. ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాబోయే ‘ఎఫ్ 3’ (F3)లో అంతకు మించిన వినోదాన్ని పంచబోతున్నట్లుగా మెహ్రీన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.


‘ఎఫ్ 2’ చిత్రంలోని పాత్రకి భిన్నంగా ‘ఎఫ్ 3’ (F3)లో తన పాత్ర ఉండోబోతుందని.. అనిల్ తన పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారని మెహ్రీన్ పేర్కొంది. మెచ్యూర్ అండ్ డిఫరెంట్ లేయర్స్ వున్న పాత్రగా.. పూర్తి వినోదాత్మకంగా తన పాత్ర ఉంటుందని.. ఈ పాత్ర తన కెరీర్‪లోనే ది బెస్ట్ ఎంటర్‌టైనర్ రోల్ కాబోతుందనే నమ్మకంతో ఉన్నట్లుగా  మెహ్రీన్ వెల్లడించింది. కాగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‪లో.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేష్(Venkatesh)‪కి జోడిగా తమన్నా భాటియా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (VarunTej)‪కి జోడిగా మెహ్రీన్ నటిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ మరో హీరోయిన్‪గా అలరించనుంది.





Updated Date - 2022-05-01T02:29:17+05:30 IST