స్నేహితుల కోసం చిరంజీవి సినిమా...

స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తి మెగాస్టార్‌ చిరంజీవి. చెన్నై ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందే రోజుల నుంచి తనతో కలసి ఉన్న స్నేహితులు సుధాకర్‌, హరిప్రసాద్‌ కోసం ఆయన ఓ సినిమా చేసి స్నేహం గొప్పతనాన్ని చాటారు. ఆ సినిమా పేరు ‘యముడికి మొగుడు’. తనతో ఇంతకుముందు ‘దేవాంతకుడు’ చిత్రాన్ని నిర్మించిన నటుడు నారాయణరావు కూడా ఈ చిత్రనిర్మాణంలో భాగస్వామి.


చిరంజీవి ద్విపాత్రాభినయంతో రూపుదిద్దుకొన్న ‘యముడికి మొగుడు’ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. సత్యనారాయణ యముడిగా నటించారు. ‘హెవెన్‌ కెన్‌ వెయిట్‌’ నవల ఆధారంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రంలో విజయశాంతి, రాధ కథానాయికలుగా నటించారు. ‘యముడికి మొగుడు’ చిత్రం శత దినోత్సవంలోనే ఆ ఏడాది ఆత్మహత్య చేసుకొన్న పత్తి రైతుల కుటుంబ సభ్యులను పిలిపించి, వారికి ఆర్ధిక సాయం అందించారు చిరంజీవి.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.