God Father Pre Release Event: గొడుగు నెట్టి వేసి.. వానలో తడుస్తూనే.. చిరు స్పీచ్
ABN , First Publish Date - 2022-09-29T03:55:50+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్’ (GodFather) ప్రీ రిలీజ్ వేడుకకు అనంతపురములో గ్రాండ్ నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేసిన
మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్’ (GodFather) ప్రీ రిలీజ్ వేడుకకు అనంతపురములో గ్రాండ్ నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకను వరుణుడు అడ్డుకున్నాడు. ఈ వేడుకకు భారీగా ప్రేక్షకులు తరలివచ్చారు. వాన పడుతున్నా కూడా ఎవరూ కదలకుండా అలాగే ఉండిపోయారు. ఒకవైపు వాన పడుతున్నా.. తన కోసం అలాగే ఉండిపోయిన ప్రేక్షకులను చూసి.. ఇదీ ప్రేమంటే అంటూ చిరు పొంగిపోయారు. పక్కన సెక్యురిటీ సిబ్బంది గొడుగు పడుతున్నా.. ఆ గొడుగును నెట్టివేసి.. చిరంజీవి (Chiranjeevi) స్పీచ్ అందుకున్నారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఇదొక సెంటిమెంట్. నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా.. ఈ నేల తడుస్తుంది. ఈ రోజు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను పాలిటిక్స్‌లో ఉండి క్యాంపెయిన్ చేసినప్పుడు పులివెందులలో.. అలాగే ‘ఇంద్ర’ (Indra) సినిమాలో వరుణ దేవుడిని ప్రార్థిస్తూ పాడిన పాటకు వర్షం కురిసింది. ఈ రోజు కూడా ఇలా వర్షం పడటం అనేది నాకు శుభపరిణామంగా అనిపిస్తుంది. థ్యాంక్యూ వరుణదేవా.. థ్యాంక్యూ సో మచ్. ఇవన్నీ ఆ భగవంతుడి ఆశీస్సులుగా భావిస్తున్నాను. ఇంత వర్షం పడుతున్నా.. ఎవ్వరూ కదలకుండా ఉన్నారే.. అదీ నిజమైన ప్రేమగా భావిస్తున్నాను. రాయలసీమలో వర్షాలు పడక, నేల నెర్రులు చాస్తుంటే.. చిరంజీవి వచ్చాడు.. వర్షం వస్తుంది.. అనే సెంటిమెంట్ మళ్లీ పునరావృతం కావడమన్నది నేను గొప్ప విజయ సంకేతంగా భావిస్తున్నాను. ఈ రోజు అసలు ఈ వేడుకకు రాగలనా? లేదా? అనే సంశయంలో ఉన్నాను.. టెన్షన్ అనుభవించాను. ఎందుకంటే, ఈ రోజు ఉదయం నుండి విశాఖపట్నంలో షూటింగ్ 2 గంటల వరకు చేశాను. అక్కడి నుండి స్పెషల్ ఫ్లైట్‌లో ఇక్కడికి వచ్చి.. మీ ఉత్సాహంలో పాలుపంచుకోవాలనుకున్న నాకు.. ప్లైట్ 2, 3 గంటలు ఆలస్యం అనే సరికి.. సమయానికి రాగలనా? లేదా అనే ఒక మీమాంశ. కానీ మీరు నాపై చూపించే ప్రేమకున్న బలం వల్ల సమయానికి రాగలిగాను. మీ అభిమానానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. మీరిలా ఉత్సాహాన్ని ఇస్తుంటే.. వాన పడుతున్నా కూడా.. ఇక్కడి నుండి అసలు వెళ్లాలని అనిపించడం లేదు.
సినిమాకి గురించి మాట్లాడే ముందుగా.. ఈ రోజు ఉదయం ఒక విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణగారి సతీమణి, సోదరుడు మహేష్ బాబు గారి మాతృమూర్తి ఇందిరా దేవి (Indira Devi)గారు కాలం చెందారు. ఆ కుటుంబం చాలా విషాదంలో ఉంది. ఆ కుటుంబానికి, కృష్ణగారికి, మహేష్‌బాబుకి నా ప్రగాఢ సానుభూతిని ఈ ‘గాడ్‌ఫాదర్’ స్టేజ్ నుండి వారికి తెలియజేసుకుంటున్నాను. ఆ మహాతల్లి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని చెప్పి.. ఆ తర్వాత చిత్రానికి సంబంధించిన విశేషాల గురించి చిరు మాట్లాడారు. (Godfather Pre Release Event)