ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న చరణ్ తిరిగి మళ్ళీ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్సీ 15 షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు. ఇప్పటికే కొంత మేర టాకీ పార్ట్, ఓ సాంగ్, భారీ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక త్వరలో మొదలుపెట్టబోతున్న లాంగ్ షెడ్యూల్లో పలు కీలక సన్నివేశాలను కంప్లీట్ చేయనున్నారట. అంతేకాదు, ఆర్సీ 15తో సమాంతరంగా 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాన్ని కూడా చరణ్ సెట్స్ మీదకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. కాస్త కూడా గ్యాప్ లేకుండా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలను కూడా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా చరణ్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇదే ఏడాది తన కొత్త ప్రాజెక్ట్స్‌ను కూడా ప్రకటించనున్నట్టు సమాచారం.