Mega Akkineni: మెగా-అక్కినేని మ‌ల్టీస్టార‌ర్..?

ABN , First Publish Date - 2021-07-24T16:23:36+05:30 IST

ఇప్పుడు టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాల హవా కొనసాగుతోంది. ఇప్పుడు మెగా, అక్కినేని హీరోల కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందనుందని టాక్ వినిపిస్తోంది.

Mega Akkineni: మెగా-అక్కినేని మ‌ల్టీస్టార‌ర్..?

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ అగ్ర కథానాయకులుగా రాణించినప్పుడు మల్టీస్టారర్ సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదు. అయితే వెంకటేశ్ తర్వాత జనరేషన్ హీరోలతో మల్టీస్టారర్ కోసం చొరవ చూపడంతో సీతమ్మవాకిట్లో సిరిమెల్లెచెట్టు, గోపాగోపాల, మసాలా వంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో వీటి హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో మెగా క్యాంప్ హీరో సాయిధరమ్ తేజ్, అక్కినేని హీరో అఖిల్ లేదా నాగచైతన్య కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ రూపొందనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా ఓ ద‌ర్శ‌కుడు సాయితేజ్‌ను క‌లిసి క‌థ‌ను నెరేట్ చేస్తే న‌చ్చింది. ఇందులో మ‌రో హీరో కూడా ఉంటాడు. మ‌రో హీరో కోసం అక్కినేని నాగ‌చైత‌న్య లేదా అఖిల్ అయితే బావుంటుంద‌ని స‌ద‌రు డైరెక్ట‌ర్‌కి హీరో సాయితేజ్ సూచించాడ‌ట‌. ఇప్పుడు స‌ద‌రు డైరెక్ట‌ర్ అక్కినేని హీరోల‌ను లైన్‌లో పెట్ట‌డానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్నాడ‌ట‌. అంతా ఓకే అయితే సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంఉటుంద‌ని టాక్ వినిపిస్తోంది. 

Updated Date - 2021-07-24T16:23:36+05:30 IST