‘ఆచార్య’ (Acharya) చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస చిత్రాల్ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. మోహన్ రాజా (Mohanraja) ‘గాడ్ ఫాదర్’ (Godfather), మెహర్ రమేశ్ (Meher Ramesh) ‘భోళాశంకర్’ (Bhola shankar) చిత్రాలతో పాటు బాబీ (Bobby) దర్శకత్వంలోనూ చిరు ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. Mega 154 గా పిలుచుకుంటున్న ఈ సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ (Waltair Veerayya) అనే మాసీ టైటిల్‌ను ఖాయం చేస్తున్నారు. త్వరలో దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది. వాల్తేర్ సముద్ర తీరం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో మాస్ మహారాజా రవితేజ (Raviteja) కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇందులో చిరు మత్స్యకారుల నాయకుడిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా చేపల్ని గ్లోబల్ గా విక్రయించే కొన్ని సీన్స్ ఉంటాయట. దాని కోసం విదేశాల్లో కొన్ని సీన్స్ తెరకెక్కించాలట. అందుకే ఈ సినిమా యూనిట్ మలేసియా పయనం కానున్నారట.
మలేసియాలో కొన్ని రోజులు షూటింగ్ జరిపిన అనంతరం చిత్ర బృందం తిరిగి హైదరాబాద్ వస్తుందట. హైదరాబాద్ లో మొదలయ్యే షెడ్యూల్‌లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. శ్రుతి హాసన్ (Shruthi Haasan) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ (Devisri prasad) సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. ‘ ముఠామేస్త్రీ’ (Mutha Mestri) తర్వాత అంతటి మాసీ పాత్రను చిరంజీవి మళ్లీ ఈ సినిమాలోనే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘వెంకీమామ’ (Venky Mama) చిత్రం తర్వాత బాబీ (Bobby) దర్శకత్వంలో రానున్న సినిమా ఇదే కావడం విశేషం. నిజానికి ఇందులో చిరు (Chiru) అండర్ కవర్ కాప్ గా నటిస్తున్నారని ఇది వరకు వార్తలొచ్చాయి. ఒక సీక్రెట్ మిషన్ లో భాగంగా ఇందులో ఆయన మత్స్యకారుడిగా కనిపిస్తాడని, రవితేజ పాత్ర కోసమే ఆయన అండర్ కవర్ కాప్ అవతారం ఎత్తుతాడని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదు కానీ.. సముద్రతీరం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ అభిమానుల్ని అలరిస్తాయని చెబుతున్నారు. మరి Mega 154 చిత్రం ఏ స్థాయి హిట్ అందుకుంటుందో చూడాలి.