అలరిస్తున్న ‘మీనాచ్చి మీనాచ్చి’ సాంగ్
ABN , First Publish Date - 2022-01-16T23:59:55+05:30 IST
శ్రీవిష్ణు హీరోగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘భళా తందనానా’ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో ఆదివారం విడుదల చేశారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన కేథరిన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌కు చక్కని స్పందన వచ్చిన సంగతి తెలిసిందే!

శ్రీవిష్ణు హీరోగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘భళా తందనానా’ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో ఆదివారం విడుదల చేశారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన కేథరిన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌కు చక్కని స్పందన వచ్చిన సంగతి తెలిసిందే! తాజాగా విడుదల చేసిన ‘మీనాచ్చి మీనాచ్చి’ లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. దర్శకుడు చైతన్య దంతులూరి శ్రీవిష్ణుని మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రజెంట్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని నిర్మాతలు తెలిపారు. త్రిపురనేని కళ్యాణచక్రవర్తి సాహిత్యం అందించిన ఈ పాటను ధనుంజయ్ ఎనర్జిటిక్‌గా పాడారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఆహ్లాదకరమైన బాణీని సమకూర్చారు.