మాస్ రాజా ఆగయా...
ABN , First Publish Date - 2022-09-24T05:59:58+05:30 IST
రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల కథానాయిక. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు...

రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల కథానాయిక. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాత. శుక్రవారం ఈ చిత్రం నుంచి ‘బడా ఎంటర్టైన్మెంట్ వాలా ఆగయా... బీసీ సెంటర్లో మోగాలి తాలియా’ అనే మాస్ గీతాన్ని విడుదల చేశారు. రామజోగయ్య శాస్ర్తి సాహిత్యం అందించారు. నకాశ్ అజీజ్ ఈ పాటని ఆలపించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చారు. ఇది వరకే ‘జింతాక్’ అనే పాట విడుదల చేశారు. దానికి మంచి స్పందన వచ్చింది. ‘‘రవితేజ ఇమేజ్‌కు తగినట్టు సాగే పాట ఇది. ఆయన గ్రేస్‌ఫుల్ స్టెప్పులు మాస్‌కి మరింత నచ్చేస్తాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నారు నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు, స్ర్కీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.