సింగర్‌గా మరోసారి మాస్ మహారాజా..!

ABN , First Publish Date - 2021-12-08T17:14:25+05:30 IST

మాస్ మహారాజా రవితేజ-రమేశ్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ సినిమా 'ఖిలాడి'. ఈ సినిమాలో రవితేజ ఓ పాట పాడబోతున్నాడట. 'ఖిలాడి' సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనుండగా..

సింగర్‌గా మరోసారి మాస్ మహారాజా..!

మాస్ మహారాజా రవితేజ-రమేశ్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ సినిమా 'ఖిలాడి'. ఈ సినిమాలో రవితేజ ఓ పాట పాడబోతున్నాడట. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనుండగా..డింపుల్ హయాతి, మీనాక్షీ చైదరి హీరోయిన్స్‌గా నటించారు. అర్జున్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ శరవేగంగా సాగుతోంది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. డీఎస్పీ మ్యూజిక్ అంటే ఆల్బం ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రాక్ స్టార్ కంపోజ్ చేస్తున్న సినిమాలో రవితేజ పాట పాడితే అది వేరే లెవల్..అభిమానులకు మాంచి మాస్ ట్రీట్. ఇప్పుడు ఆ మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నారు రవితేజ - డీఎస్పీ. ఈ సినిమాలో రవితేజ ఓ హుషారైన పాటను పాడబోతున్నాడు. ఈ సాంగ్ రికార్డింగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాడు. కాగా, రవితేజ ఇలా పాట పాడటం కొత్తేమీ కాదు. గతంలో 'బలుపు' చిత్రంలో కాజల్ చెల్లివా, 'పవర్' చిత్రంలో నాటోంకి నాటోంకీ, 'డిస్కోరాజా'లో రమ్ పమ్ బమ్ లాంటి మాస్ నంబర్స్ పాడాడు. మరోసారి 'ఖిలాడి' సినిమాకోసం ఈ మాస్ రాజా గొంతు సవరించబోతున్నాడు.  

Updated Date - 2021-12-08T17:14:25+05:30 IST