టైగర్‌ నాగేశ్వరరావుగా మాస్ మహారాజ..?

ABN , First Publish Date - 2021-08-08T15:50:21+05:30 IST

టైగర్‌ నాగేశ్వరరావుగా మాస్ మహారాజ రవితేజ నటించబోతున్నాడనే తాజా వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. స్టువర్ట్‌పురానికి చెందిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు బయోపిక్‌ను సినిమాగా తీయాలని కొన్నేళ్లుగా నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ సన్నాహాలు చేస్తున్నారు.

టైగర్‌ నాగేశ్వరరావుగా మాస్ మహారాజ..?

టైగర్‌ నాగేశ్వరరావుగా మాస్ మహారాజ రవితేజ నటించబోతున్నాడనే తాజా వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. స్టువర్ట్‌పురానికి చెందిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు బయోపిక్‌ను సినిమాగా తీయాలని కొన్నేళ్లుగా నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ సన్నాహాలు చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఈ సినిమా నిర్మించనున్నట్టు ఆమధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, అధికారకంగా మాత్రం వెల్లడి కాలేదు. అయితే, ఇప్పుడు ఇదే కథ హీరో రవితేజ వద్దకు వచ్చినట్టు సమాచారం. 


ప్రస్తుతం రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ', 'ఖిలాడీ' సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో టైగర్‌ నాగేశ్వరరావు కథ నచ్చడంతో.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పుడు చేస్తున్న చిత్రాలు పూర్తి కాగానే టైగర్‌ నాగేశ్వరరావు మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీకి వంశీ కృష్ణ నాయుడు దర్శకత్వం వహించనుండగా, భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా సినిమాగా అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి రానున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారక వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2021-08-08T15:50:21+05:30 IST